విజయవాడలోని కొత్త ప్రభుత్వాసుపత్రిలో అర్థరాత్రి ఘర్షణ చోటుచేసుకుంది. ఫేషెంట్‌కు ట్రీట్‌మెంట్ చేయడంలో ఎందుకు లేట్ చేస్తున్నారంటూ డ్యూటీ డాక్టర్లని పేషెంట్ బంధువులు నిలదీశారు. ఈ విషయంలో డ్యూటీ డాక్టర్లకీ-పేషెంట్ బంధువులకు మధ్య వాగ్వాదం జరిగింది. తమపై దాడి జరుగుతోందని.. పక్కనే ఉన్న హాస్టల్‌లో ఉంటున్న మెడికల్ కాలేజీ విద్యార్థులకి ఒక డ్యూటీ డాక్టర్ మెసేజ్ చేశాడు. దీంతో 200 మందికిపైగా మెడికల్ విద్యార్ధులు ఆస్పత్రికి చేరుకుని పేషెంట్ బంధువులను చితకబాదారు.
తరువాత వారు.. జూనియర్ డాక్టర్లపై మాచవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ట్రీట్‌మెంట్ ఎందుకు చేయలేదని నిలదీసినందుకే.. జూనియర్ డాక్టర్లు, విద్యార్థులు తమపై దాడి చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. తర్వాత డాక్టర్లు కూడా పోలీసు స్టేషన్‌లో పేషెంట్ బంధువులపై ఫిర్యాదు చేశారు. ఇరు వర్గాల ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు విచారణ జరుపుతామని తెలిపారు.