భార్యాపిల్లల్ని నిర్లక్ష్యం చేసి మరో మహిళతో సహజీవనం చేస్తున్న భర్తకు బడితే పూజ చేసిందో ఇల్లాలు.. తన కాపురంలో నిప్పులు పోసిన మహిళ వీపు విమానం మోత మోగించింది. ఈ ఘటన విశాఖపట్టణంలో జరిగింది. విశాఖపట్నం పెందుర్తి కి చెందిన గంగాధర్ రెడ్డికి భార్య పుష్పలత, కొడుకు ఉన్నారు. అయితే కొంతకాలంగా గంగాధర్ రెడ్డి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో భార్యాకొడుకును నిర్లక్ష్యం చేసి షీలానగర్ లో ప్రియురాలితో సహజీవనం చేస్తున్నాడు. భార్య, బంధువులు ఎంత చెప్పినా ఆ మహిళను వదల్లేదు. ఈ నేపథ్యంలో శనివారం భార్య పుష్పలత మహిళా సంఘాలు, పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మహిళా సంఘాలతో కలిసి పుష్పలత గంగాధరరెడ్డి ప్రియురాలితో ఉంటున్న ఇంటివద్దకు చేరుకున్నారు. గంగాధర్ సదరు మహిళతో ఇంట్లో ఉండగా బయట తాళాలు వేసి ఆందోళనకు దిగారు. కొద్దిసేపటి తర్వాత రంగప్రవేశం చేసిన పోలీసులు ఇంట్లో ఉన్న ఇద్దరినీ బయటకు తీసుకొచ్చారు. దీంతో భర్తపై తీవ్ర కోపంతో ఉన్న పుష్పలత అతనిపై దాడి చేసింది. అంతేకాదు భర్త ప్రియురాలిని పోలీసుల ముందే విచక్షణా రహితంగా చితకబాదింది. కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. చివరకు వారందర్ని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు పోలీసులు.