గోదావరి బోటు ప్రమాదం .. పసికందు మృతదేహం లభ్యం

Update: 2019-09-16 11:46 GMT

గోదావరి బోటు ప్రమాద మృతుల కోసం ముమ్మరంగా గాలింపు కొనసాగుతోంది. సోమవారం మరో నాలుగు మృతదేహాలు వెలికితీశారు. వాడపల్లి దగ్గర ఓ పసికందు డెడ్‌బాడీ దొరికింది. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 12 కి చేరింది. ఇంకా 33 మందిని గుర్తించాల్సి ఉందని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ వెల్లడించారు. గల్లంతైన మిగతావారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రత్యేక బోట్లతో విస్తృతంగా గాలిస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఇప్పటికే 8 ఈఆర్‌ బృందాలు, 12 ప్రత్యేక గజ ఈతగాళ్ల బృందాలు, 6 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, రెండు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు, ఒక నేవీ చాప్టర్, ఓఎన్‌జీసీ చాప్టర్‌ ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఇప్పటి వరకు 27 మంది ప్రమాదం నుంచి బయటపడ్డట్టు తెలిపారు.

బోటు ప్రమాద ఘటనపై సీఎం జగన్ ఏరియల్‌ సర్వే నిర్వహించారు. లాంచీ ప్రమాదం జరిగిన కచ్చులూరు ప్రాంతాన్ని రెస్క్యూ ఆపరేషన్‌ ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం రాజమండ్రి ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని బాధితులకు సీఎం జగన్ భరోసా ఇచ్చారు. బాధితుల నుంచి ప్రమాద ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు సీఎం.

Also watch :

Full View

Similar News