కోడెల జీవితాన్ని మలుపుతిప్పిన 1983

Update: 2019-09-16 07:47 GMT

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన నందమూరి తారక రామారావు అప్పట్లో గుంటూరు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు డాక్టర్ కోడెల ఆయన దృష్టిలో పడ్డారు. ఆయన పోటీ చేయటానికి ఇష్టపడక పోయినప్పటికీ, నందమూరి తారక రామారావు 1983 లో ఎన్నికలలో పోటీ చేయటానికి ప్రేరేపించారు. డాక్టర్ కోడెల అప్పటి ఎన్నికల్లో నర్సరావుపేట నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీచేసి ఘన విజయం సాధించారు. ఆ తర్వాత 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో నర్సరావుపేట నుంచి వరుస విజయాలు నమోదు చేశారు డాక్టర్ కోడెల. 2004, 2009 ఎన్నికల సమయంలో టీడీపీ అధికారానికి దూరమైనప్పుడు వరుస పరాజయాలు చవిచూశారు. డాక్టర్ కోడెల రాష్ట్ర విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో జరిగిన తొలి ఎన్నికల్లో సొంత నియోజకవర్గం నరసరావుపేటను వదిలి సత్తెనపల్లి నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

Similar News