శివప్రసాద్‌ మృతిపట్ల జనసేన సంతాపం

Update: 2019-09-21 13:13 GMT

శివప్రసాద్‌ మృతిపట్ల జనసేన పార్టీ సంతాపం వ్యక్తం చేసింది. శివప్రసాద్‌ తుదిశ్వాస విడిచారని తెలిసి బాధపడ్డానన్నారు పవన్ కళ్యాణ్. సమైక్య రాష్ట్రం కోసం..ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్‌లో ఆయన తనదైన శైలిలో స్పందించారన్నారు. తనలోని కళాకారుడి ద్వారా నిరసన గళం వినిపించారని గుర్తు చేసుకున్నారు పవన్. నటుడిగా, నాయకుడిగా ప్రజాజీవితంలో తనదైన పంథాలో వెళ్లిన నేత శివప్రసాద్‌ అన్నారు పవన్.

Similar News