మెట్రో పాతబస్తీ వైపుకు కూడా పరుగులు పెట్టనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోద ముద్ర లభించింది. సుమారు 5.5 కిలోమీటర్ల వరకు పాతబస్తీలో మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. ఇది పూర్తయితే పాత బస్తీ వాసులకు కాస్త ఊరట లభిస్తుంది. ఇరుకు రోడ్లు, ఇసకేస్తే రాలని జనసమూహంతో ఇబ్బంది పడుతూ ట్రాఫిక్‌లో చిక్కుకున్న నగర జీవికి మెట్రో వరప్రదాయని. ఇక్కడ మెట్రో నిర్మాణం చేపడితే చారిత్రక కట్టడాలకు, మందిరాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం వుందని ముందు వ్యతిరేకత వినిపించినా.. వాటికి ఎలాంటి నష్టం కలగకుండా నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపింది ఎల్‌అండ్‌టీ సంస్థ. పాతబస్తీకి వెళ్లే రూట్లలో మొత్త 5 స్టేషన్లను ఖరారు చేశారు. సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, శంషేర్‌గంజ్, ఫలక్‌నుమా ప్రాంతాల్లో స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు అధికారులు. మెట్రో నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం కావడంతో ప్రాజెక్టు పనులు పూర్తి చేయడమే ప్రధమకర్తవ్యమని అంటున్నారు.