టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ శివప్రసాద్ మృతిపట్ల టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శివప్రసాద్ మృతి తెలుగుదేశం పార్టీకి తీరనిలోటు అన్నారు. రాజకీయ నాయకుడిగా, నటుడిగా శివప్రసాద్ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిపోయారన్నారు చంద్రబాబు. రాష్ట్రాభివృద్ధి కోసం..ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్ ముందు వినూత్న రీతిలో ఆయన తెలిపిన నిరసన కార్యక్రమాలు ప్రజలు మరిచిపోలేరన్నారు. చిత్తూరు ఎంపీగా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను శివప్రసాద్ చేపట్టారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.