ఉచితంగా భోజనం ప్యాకెట్లు పంచిన హోటల్‌ యజమానిపై ఎస్సై దాడి

Update: 2019-09-22 10:04 GMT

వరద బాధితుల కష్టాలు చూసి ఓ హోటల్‌ యజమాని కడుపు తరుక్కుపోయింది. కనీసం ఒక పూటైనా వాళ్ల కడుపు నింపాలనుకున్నాడు. అందరికీ ఉచితంగా భోజనం ప్యాకెట్లు పంచాడు. ఈ క్రమంలో ట్రాఫిక్‌ జామ్‌ అయిందని స్థానిక ఎస్సైకి కోపమొచ్చింది. హోటల్‌ యజమానితో దురుసుగా ప్రవర్తించి దాడి చేశాడు ఎస్సై.

ఈ ఘటన కర్నూలు జిల్లా సిరివెళ్ల మండలం గోవిందపల్లె మెట్ట వద్ద జరిగింది. అమరావతి హోటల్‌ యజమాని మాదవరెడ్డి భోజనం ప్యాకెట్లు పంచడం వల్లే ట్రాఫిక్‌ జామ్‌ అయిందని చేయిచేసుకున్నాడు ఎస్సై తిమ్మారెడ్డి.

Also watch :

Full View

Similar News