టీటీడీ బోర్డు తొలి సమావేశం.. చర్చించే అంశాలివే..

Update: 2019-09-23 03:02 GMT

సోమవారం టీటీడీ బోర్డు తొలి సమావేశం జరగనుంది. ముందుగా సభ్యుల ప్రమాణస్వీకారం తర్వాత అన్నమయ్య భవన్‌లో భేటీ అవుతారు. అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణ నిధుల కుదింపుపై చర్చ జరగనుంది. శ్రీవాణి ట్రస్ట్‌ ద్వారా వీఐపీ బ్రేక్ దర్శనాలపైనా చర్చ జరగనుంది. రూ.100 కోట్లతో తిరుపతిలో హాస్టల్ నిర్మాణానికి ఆమోదం తెలపనుంది బోర్డు. రూ.79 కోట్లతో తిరుమలలో యాత్రికుల వసతి సముదాయం-5 నిర్మాణం, తిరుపతిలో గరుడ వారధికి రూ.100 కోట్లు కేటాయింపునకు ఆమోదం, శ్రీవారి ప్రసాదం ముడిసరుకుల కొనుగోలు అలాగే కీలకమైన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై పాలకమండలి చర్చించనుంది.

Similar News