నెల్లూరు జిల్లాలో ఓ ఆశావర్కర్ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దగదర్తి మండలం, యలమంచిపాడు గ్రామంలో ఈ ఘటన జరిగింది. తనను ఉద్యోగం నుంచి తొలగిస్తారన్న ఆందోళనతో.. ఆశావర్కర్ ప్రమీల ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆమె చికిత్సపొందుతోంది.
గత మూడేళ్లుగా ప్రమీల.. తురిమెర్ల పీహెచ్‌సీలో ఆశావర్కర్‌గా పనిచేస్తోంది. అయితే అధికార పార్టీ నేతలు.. తనను ఉద్యోగం నుంచి తొలగించాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపిస్తోంది బాధితురాలు. గతమూడు నెలలుగా తనను వేధిస్తున్నట్లు చెబుతోంది. అందుకే ఆత్మహత్యాయత్నం చేసుకున్నానంటోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
Also watch :