ఇది మాటలకందని విషాదం... శంషాబాద్ విమానాశ్రయం దగ్గర దారుణం జరిగింది. ఎయిర్‌పోర్టు కార్గోలో విధులు ముగించుకుని.. ఇంటికి బయల్దేరిన యాదయ్య అనే ఉద్యోగి అనుకోని రీతిలో మృత్యువాత పడ్డాడు. భారీ వర్షం కురుస్తున్న సమయంలో.. ఎయిర్‌పోర్ట్ రోడ్డులో యాదయ్య బైక్‌ను ఓ క్యాబ్ ఢీకొట్టింది. ఈ సమయంలో యాదయ్య చొక్కా క్యాబ్‌కు చిక్కుకుంది. ఇది గమనించని క్యాబ్ డ్రైవర్ యాదయ్యను దాదాపు 5 కిలో మీటర్ల వరకు అలాగే ఈడ్చుకెళ్లాడు.
చివరకు కిషన్ గూడ ఓఆర్‌ఆర్ టోల్ గేట్ దగ్గర యాదయ్య పడిపోయాడు. ఆయన విగత జీవిగా మారాడు. టోల్ గేట్ దగ్గర యాదయ్యను గుర్తించిన క్యాబ్ డ్రైవర్.. క్యాబ్‌ను అక్కడే వదిలేసి పారిపోయాడు. పోలీసులు.. ఎయిర్‌పోర్ట్ రోడ్డులో యాదయ్య బైక్‌ను గుర్తించారు. డెడ్‌బాడీని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. విమానాశ్రయం దగ్గర సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు... ప్రమాదానికి కారణమైన క్యాబ్ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.