అనంతపురం జిల్లా కదిరి గురుకుల సంక్షేమ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న అమృత మృతి కలకలం సృష్టించింది. హాస్టల్ బాత్రూంలో చిన్నారి కళ్లు తిరిగి పడిపోయిందని, ఆస్పత్రికి తీసుకెళ్లేలోగా ఆమె చనిపోయిందని స్కూల్ ప్రిన్సిపాల్ తెలిపారు.
అయితే తల్లిదండ్రులు, బంధువులు అమృత ఎంతో ఆరోగ్యంగా ఉండేదని చెబుతున్నారు. ఆమె మృతిపై అనుమానాలున్నాయని అంటున్నారు. హాస్టల్‌లో ఏం జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. అమృత మృతి కలకలం సృష్టించడంతో.. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే చాంద్ పాషా ఘటనా స్థలాన్ని సందర్శించారు. చిన్నారి తల్లిదండ్రులను పరామర్శించారు.
Also watch :