భారీ వర్షాలకు అనంతపురం జిల్లా అతలాకుతలమవుతోంది. రాయదుర్గం నియోజకవర్గంలో గుమ్మగట్ట, కనేకల్, డి.హిరేహాల్, బొమ్మనహాళ్ మండలాల్లో భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ ప్రాంతాల్లో 168 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇళ్లలోకి వరదనీరు రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జనం.
రాయదుర్గం పట్టణంలో పురాతన కోట ప్రధాన ద్వారం లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చాలా చోట్ల వరి, మొక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మల్లాపురంలో గత 40 ఏళ్లుగా నిండని చెరువు భారీ వర్షంతో నిండింది. అనంతపురం జాతీయ రహదారిలోని ఉడేగోళం గ్రామ సమీపంలో భారీ వర్షానికి కల్వర్టు కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.