TG: తెలంగాణ ఆరోగ్య రంగంలో విప్లవం

డిజిటల్ సాంకేతికతో హెల్త్ కార్డులు.. అందరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్.. సంగారెడ్డి జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్... నేడు ప్రారంభించనున్న రాజనర్సింహ

Update: 2026-03-12 04:45 GMT

తె­లం­గా­ణ­లో వై­ద్య ఆరో­గ్య రం­గా­న్ని మరింత ఆధు­ని­కం­గా మా­ర్చేం­దు­కు రా­ష్ట్ర ప్ర­భు­త్వం కీలక అడు­గు వే­స్తోం­ది. డి­జి­ట­ల్ సాం­కే­తి­క­త­ను వి­ని­యో­గిం­చి ప్ర­తి వ్య­క్తి ఆరో­గ్య వి­వ­రా­ల­ను ఒకే చోట భద్ర­ప­ర­చే వి­ధం­గా డి­జి­ట­ల్ హె­ల్త్ ప్రొ­ఫై­ల్ వ్య­వ­స్థ­ను అమలు చే­యా­ల­ని ప్ర­భు­త్వం ని­ర్ణ­యిం­చిం­ది. ఈ పథకం ద్వా­రా రో­గు­లు ప్ర­భు­త్వ ఆసు­ప­త్రు­ల­కు వె­ళ్లి­న­ప్పు­డు పాత రి­కా­ర్డు­లు, పరీ­క్షల వి­వ­రా­లు లేదా చీ­టీ­లు తీ­సు­కె­ళ్లా­ల్సిన అవ­స­రం లే­కుం­డా, ఒకే హె­ల్త్ కా­ర్డు ద్వా­రా వై­ద్య సే­వ­లు పొం­దే­లా చే­యా­ల­ని లక్ష్యం­గా పె­ట్టు­కుం­ది. ఈ కా­ర్య­క్ర­మా­న్ని ముం­దు­గా ప్ర­యో­గా­త్మ­కం­గా అమలు చే­య­డా­ని­కి సం­గా­రె­డ్డి జి­ల్లా­ను ఎం­పిక చే­శా­రు. దా­దా­పు రూ.94 కో­ట్ల వ్య­యం­తో జి­ల్లా­లో­ని ప్ర­భు­త్వ ఆసు­ప­త్రు­ల­కు వచ్చే ప్ర­తి రో­గి­కి పూ­ర్తి ఆరో­గ్య వి­వ­రా­ల­తో డి­జి­ట­ల్ హె­ల్త్ ప్రొ­ఫై­ల్ రూ­పొం­దిం­చ­ను­న్నా­రు. ఈ కా­ర్య­క్ర­మా­న్ని ప్రా­రం­భిం­చేం­దు­కు అధి­కా­రు­లు ఏర్పా­ట్లు పూ­ర్తి చే­య­గా, గు­రు­వా­రం సం­గా­రె­డ్డి జి­ల్లా­లో మం­త్రి దా­మో­ద­ర్ రా­జ­న­ర్సింహ చే­తుల మీ­దు­గా దీ­ని­కి శ్రీ­కా­రం చు­ట్ట­ను­న్నా­రు.

ఆరోగ్య సమాచారమంతా..

ఈ డి­జి­ట­ల్ హె­ల్త్ ప్రొ­ఫై­ల్ అమ­లు­లో­కి వస్తే, ప్ర­భు­త్వ ఆసు­ప­త్రు­ల­కు వచ్చే ప్ర­తి వ్య­క్తి ఆరో­గ్య సమా­చా­రం డి­జి­ట­ల్ రూ­పం­లో నమో­దు అవు­తుం­ది. రోగి గతం­లో ఏ వ్యా­ధి­తో చి­కి­త్స తీ­సు­కు­న్నా­డు, ఏ పరీ­క్ష­లు చే­యిం­చు­కు­న్నా­డు, ఏ మం­దు­లు వా­డు­తు­న్నా­డు వంటి వి­వ­రా­లు అన్నీ ఒకే ప్రొ­ఫై­ల్‌­లో ని­ల్వ చే­య­బ­డ­తా­యి. తద్వా­రా రోగి ఏ ప్ర­భు­త్వ ఆసు­ప­త్రి­కి వె­ళ్లి­నా అక్క­డి వై­ద్యు­లు వెం­ట­నే ఆ వి­వ­రా­ల­ను పరి­శీ­లిం­చి సరైన చి­కి­త్స అం­దిం­చ­గ­లు­గు­తా­రు. పీ­హె­చ్‌­సీ­లు, ఏరి­యా ఆసు­ప­త్రు­లు, జి­ల్లా ఆసు­ప­త్రు­లు నుం­చి బో­ధ­నా­సు­ప­త్రుల వరకు ఎక్క­డై­నా ఈ హె­ల్త్ కా­ర్డు ద్వా­రా రోగి వి­వ­రా­లు అం­దు­బా­టు­లో ఉం­డే­లా వ్య­వ­స్థ­ను రూ­పొం­ది­స్తు­న్నా­రు. ఈ కా­ర్య­క్ర­మా­న్ని పూ­ర్తి­గా కా­గి­త­ర­హిత వి­ధా­నం­లో అమలు చే­యా­ల­నే లక్ష్యం­తో ప్ర­భు­త్వం ముం­దు­కె­ళు­తోం­ది. ప్ర­భు­త్వ ఆసు­ప­త్రు­ల­కు వచ్చే రో­గు­లు ఇకపై చీ­టీ­లు లేదా పాత పరీ­క్షల పత్రా­లు వెంట తీ­సు­కు­రా­వా­ల్సిన అవ­స­రం లే­కుం­డా హె­ల్త్ కా­ర్డు చూ­పి­స్తే సరి­పో­తుం­ది. వై­ద్యు­లు ఆ కా­ర్డు ద్వా­రా రోగి ఆరో­గ్య చరి­త్ర­ను పరి­శీ­లిం­చి చి­కి­త్స అం­ది­స్తా­రు. అవ­స­ర­మైన మం­దు­ల­ను కూడా అదే కా­ర్డు ఆధా­రం­గా అం­దిం­చే వి­ధం­గా ఏర్పా­ట్లు చే­స్తు­న్నా­రు. దీ­ని­వ­ల్ల ఆసు­ప­త్రు­ల్లో రి­కా­ర్డుల ని­ర్వ­హణ సు­ల­భం అవ్వ­డం­తో పాటు రో­గు­ల­కు కూడా సమయం ఆదా అవు­తుం­ద­ని అధి­కా­రు­లు భా­వి­స్తు­న్నా­రు. ఇప్ప­టి­కే దే­శ­వ్యా­ప్తం­గా అమ­లు­లో ఉన్న ఆయు­ష్మా­న్ భా­ర­త్ హె­ల్త్ అకౌం­ట్ (ఆభా) వ్య­వ­స్థ­తో కూడా ఈ ప్ర­ణా­ళి­క­ను అను­సం­ధా­ని­స్తు­న్నా­రు. ఆధా­ర్ సం­ఖ్య ఆధా­రం­గా ప్ర­భు­త్వ ఆసు­ప­త్రు­ల­కు వచ్చే రో­గు­ల­కు జా­తీయ ఆరో­గ్య మి­ష­న్ ద్వా­రా ఆభా నం­బ­ర్లు కే­టా­యి­స్తు­న్నా­రు. ఈ నం­బ­ర్ల ఆధా­రం­గా ఓపీ వి­భా­గా­ల్లో స్లి­ప్‌­లు సు­ల­భం­గా పొం­దే వి­ధా­నా­న్ని ఇప్ప­టి­కే అమలు చే­స్తు­న్నా­రు. అదే వ్య­వ­స్థ­ను మరింత వి­స్త­రిం­చి రా­ష్ట్ర ప్ర­భు­త్వం డి­జి­ట­ల్ హె­ల్త్ ప్రొ­ఫై­ల్ రూ­పం­లో సమ­గ్ర ఆరో­గ్య రి­కా­ర్డు వ్య­వ­స్థ­ను రూ­పొం­ది­స్తోం­ది. ఈ ప్రా­జె­క్టు­కు అవ­స­ర­మైన సా­ఫ్ట్‌­వే­ర్ రూ­ప­క­ల్ప­న­లో ఆరో­గ్య­శ్రీ వి­భా­గం కీలక పా­త్ర పో­షి­స్తోం­ది. టీజీ ఆన్‌­లై­న్ ప్లా­ట్‌­ఫా­ర­మ్ ద్వా­రా సాం­కే­తిక వ్య­వ­స్థ­ను అభి­వృ­ద్ధి చేసి, ఆసు­ప­త్రుల మధ్య డేటా మా­ర్పి­డి­ని సు­ల­భ­త­రం చే­యా­ల­ని అధి­కా­రు­లు ప్ర­ణా­ళిక రూ­పొం­దిం­చా­రు.

ఆరోగ్య రంగంలో డిజిటల్ విప్లవం

ఈ వ్య­వ­స్థ అమ­లు­లో­కి వచ్చిన తరు­వాత రా­ష్ట్రం­లో­ని ప్ర­జల ఆరో­గ్య పరి­స్థి­తు­ల­పై ప్ర­భు­త్వా­ని­కి సమ­గ్ర సమా­చా­రం లభి­స్తుం­ది. ఏ ప్రాం­తం­లో ఏ వ్యా­ధు­లు ఎక్కు­వ­గా ఉన్నా­యి, ఏ వై­ద్య సే­వ­లు అవ­స­రం అవు­తు­న్నా­యి, ఎక్కడ వై­ద్య వస­తు­లు పెం­చా­ల్సిన అవ­స­రం ఉంది వంటి వి­ష­యా­ల­ను వి­శ్లే­షిం­చ­డా­ని­కి ఇది సహా­య­ప­డు­తుం­ది. ఆరో­గ్య సమ­స్య­ల­పై స్ప­ష్ట­మైన డేటా లభిం­చ­డం వల్ల ప్ర­భు­త్వా­ని­కి సరైన వి­ధాన ని­ర్ణ­యా­లు తీ­సు­కో­వ­డం సు­ల­భ­మ­వు­తుం­ది. ని­ధుల కే­టా­యిం­పు, వై­ద్య సదు­పా­యాల వి­స్త­రణ, అత్య­వ­సర సేవల మె­రు­గు­దల వంటి అం­శా­ల్లో కూడా ఇది కీ­ల­కం­గా ఉప­యో­గ­ప­డు­తుం­ద­ని వై­ద్యా­ధి­కా­రు­లు చె­బు­తు­న్నా­రు. ఇదే సమ­యం­లో రా­ష్ట్ర­వ్యా­ప్తం­గా మహి­ళల ఆరో­గ్యం­పై ప్ర­త్యేక దృ­ష్టి పె­ట్టా­ల­ని ప్ర­భు­త్వం ని­ర్ణ­యిం­చిం­ది. ము­ఖ్యం­గా డ్వా­క్రా మహి­ళ­ల­కు ఉచిత వై­ద్య పరీ­క్ష­లు ని­ర్వ­హిం­చి వారి ఆరో­గ్య పరి­స్థి­తు­ల­పై సమ­గ్ర డి­జి­ట­ల్ రి­కా­ర్డు రూ­పొం­దిం­చా­ల­నే లక్ష్యా­న్ని ప్ర­క­టిం­చా­రు. సు­మా­రు 42 లక్షల మంది డ్వా­క్రా మహి­ళ­ల­కు వై­ద్య పరీ­క్ష­లు ని­ర్వ­హిం­చి వారి ఆరో­గ్య వి­వ­రా­ల­ను డి­జి­ట­ల్ హె­ల్త్ ప్రొ­ఫై­ల్‌­లో నమో­దు చే­యా­ల­ని ఆరో­గ్య­శాఖ మం­త్రి దా­మో­ద­ర్ రా­జ­న­ర్సింహ అధి­కా­రు­ల­కు ఆదే­శిం­చా­రు. సె­క్ర­టే­రి­య­ట్‌­లో జరి­గిన సమీ­క్ష సమా­వే­శం­లో ప్ర­జా­పా­లన–ప్ర­గ­తి కా­ర్య­క్ర­మం­లో భా­గం­గా చే­ప­ట్టా­ల్సిన చర్య­ల­పై మం­త్రి అధి­కా­రు­ల­కు ది­శా­ని­ర్దే­శం చే­శా­రు. ఈ నెల 6 నుం­చి జూన్ 12 వరకు అమలు చే­యా­ల్సిన కా­ర్య­క్ర­మా­ల­ను 99 రో­జుల యా­క్ష­న్ ప్లా­న్ రూ­పం­లో అమలు చే­యా­ల­ని తెలంగాణ ప్రభుత్వం అధికారులకు సూచించింది.

Tags:    

Similar News