శ్రీకాకుళం జిల్లాలోని ఓ కామాందుడి వికృత చేష్టలకు శైలజ బలైంది. ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని మహిళా సంఘాలు ఆందోళనబాట పట్టాయి. స్నానం చేస్తుండగా వీడియో తీసి.. సోషల్ మీడియాలో పెడతానంటూ మాధవరావు అనే వ్యక్తి బ్లాక్ మెయిల్ కు పాల్పడడంతో శైలజ ఆత్మహత్య చేసుకుంది. అయితే ఈ కేసులో పోలీసులు జరుపుతున్న దర్యాప్తుపై ప్రజాసంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. నిందితుడికి సహకరించిన తులసి, ఈశ్వరరెడ్డి లను అరెస్టు చేయకపోవడంపై భగ్గుమంటున్నాయి. ఉపాథి హామీ పథకంలో ఉద్యోగిగా ఉన్న నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.