వైసీపీ ప్రభుత్వం అణచి వేసే ధోరణితో వ్యవహరిస్తుందని.. ఎంత అణగదొక్కితే అంత రెచ్చిపోతామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు టీడీపీ అధినేత చంద్రబాబు. టీవీ5, ఏబీన్ ఛానళ్లను దుర్మార్గంగా బ్యాన్ చేశారని మండిపడ్డారు. చట్టం అందరికి చట్టంగా ఉంటుందా? లేక ఒక వైసీపీకి మాత్రమే చుట్టంగా ఉంటుందా అని ప్రశ్నించారు. ఎవరిని వదిలిపెట్టేది లేదని.. ప్రతి ఒక్క కేసు రివ్యూ చేస్తామని అన్నారు చంద్రబాబు.
టీడీపీపై నీచంగా పోస్టులు పెడితే చర్యలు తీసుకోరని.. కానీ టీడీపీ కార్యకర్తలపై ఇష్టానుసారంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు చంద్రబాబు. చాలా నీచాతి నీచంగా క్యారెక్టర్ అసాషినేషన్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇష్టానుసారం చేయాలంటే ఇది పులివెందుల కాదు అని హెచ్చరించిన చంద్రబాబు... ప్రజలు చీ కొట్టే పరిస్థితి తెచ్చుకోవద్దని అన్నారు.