డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి కులంపై వివాదం

Update: 2019-10-04 14:14 GMT

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి కులం ఏంటన్నది వివాదాస్పదమవుతోంది. శ్రీవాణి గిరిజన మహిళ కాదంటూ ఇటీవలే SC, ST సంఘాల నాయకులు... పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ ముత్యాల రాజుకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణకు ఆదేశించిన కలెక్టర్‌.. KR పురం ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి అధ్యక్షతన కమిటీ నియమించారు. అయితే ఈ వివాదంపై స్పందించిన మంత్రి పుష్ప శ్రీవాణి ఆరోపణలను తేలిగ్గా తీసుకున్నారు. 2014 లో కూడా టీడీపీ నేతలు ఎలక్షన్‌ పిటిషన్‌ వేసినా కోర్టు కొట్టేసిందని.. అప్పుడు వెనకుండి కేసులు వేయించిన వారే... ఇప్పుడు డైరెక్ట్‌గా తనపై పిటిషన్‌ వేశారని అన్నారు. 2008 నుంచి తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తూనే ఉన్నా... నిరూపించలేకపోయారని పుష్ప శ్రీవాణి తెలిపారు..

బుట్టాయగూడెం మండలం దొరమామిడి గ్రామానికి చెందిన పుష్పవాణికి 2014లో తహశీల్దార్‌.... S.T కొండదొర ధృవపత్రాన్నిఇచ్చారు. అయితే శ్రీవాణి తండ్రి సాంబమూర్తి కుల ధృవీకరణ పత్రంలో కొండ అనే కులంపేరు ఉన్నట్లు ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. కొండ అనే కులం గిరిజన ఉపకులాల్లో లేదని వాదించారు. తప్పుడు ధృవపత్రంతో MLA గా పోటీ చేశారని ఫిర్యాదులో తెలిపారు. అలాగే ఆమె సోదరి తులసి గతంలో DSC కి దరఖాస్తు చేసినప్పుడు.. ఆమె ST కాదంటూ అధికారులు దరఖాస్తును తిరస్కరించినట్లు కంప్లెయింట్‌లో వెల్లడించారు.

Similar News