ఆ లాభం వారికే పోతోంది.. రైతుల ఆవేదన

Update: 2019-10-04 10:20 GMT

ఉల్లి ధర ఘాటుతో తిరుపతిలో సామాన్య మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఉల్లితో పాటు టమాట ధరలు కూడ పెరిగిపోవడంతో సామాన్య ప్రజలు కూరగాయల మార్కెట్‌కు రావాలంటేనే వణికిపోతున్నారు. పెరిగిన రేట్ల నేపథ్యంలో.. ప్రభుత్వమే స్వయంగా రంగంలోకి దిగి కిలో ఉల్లిపాయలు 25 రూపాయలకు అమ్ముతోంది. అయితే.. ఆ ఉల్లిపాయలు నాణ్యత లేక పోవడంతో సామాన్యులు ఆవైపు తొంగి చూడడం లేదు. అయితే.. పెరిగిన రేట్ల ప్రతిఫలం ఉల్లి, టమాటా రైతులకు చేరడం లేదు. అటు రైతులు, ఇటు వినియోగదారులు ఇద్దరూ తీవ్రంగా నష్టపోతున్నారు. కేవలం దళారులకే లాభం చేకూరుతోందని రైతులు, వినియోగదారులు వాపోతున్నారు.

Similar News