మంత్రి విశ్వరూప్‌ ఇంటిముందు యువతి.. పురుగుల మందుతాగి..

Update: 2019-10-04 10:50 GMT

తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో మంత్రి విశ్వరూప్‌ ఇంటిముందు ఓ యువతి పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ కలహాల నేపథ్యంలో తనకు న్యాయం చేయమని మళ్లీశ్వరీ అనే యువతి గత 2రోజులుగా మంత్రిని మొరపెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఐనా న్యాయం జరగకపోవడంతో చివరికి మంత్రి విశ్వరూప్‌ ఎదురుగానే యువతి పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో యువతి మళ్లీశ్వరిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం యువతి పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నట్టు తెలుస్తుంది.

Similar News