కృష్ణా జిల్లాలో కంకిపాడు మండలం మద్దూరు దసరా ఉత్సవాల్లో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడి చేశారు. దీంతో ఐదుగురు టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను విజయవాడ ఆస్పత్రికి తరలించారు. దసరా వేడుకలు జరుపుకుంటున్న తమపై నిందితులు ఎక్కడ నుంచో వచ్చి దాడి చేశారని బాధితుల బంధువులు పేర్కొన్నారు. ఘటనస్థలికి చేరుకున్న కంకిపాడు పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను టీడీపీ నేతలు పరామర్శించారు.