విశాఖలోని నర్సీపట్నంలో వైఎస్సార్ కంటి వెలుగు పథకం ప్రారంభోత్సవం విమర్శల పాలైంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వల్ల తూతూ మంత్రంగా ప్రారంభమైంది. కంటి వెలుగు పథకం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై ఎమ్మెల్యే ఉమాశంకర్ ఆసహనం వ్యక్తం చేశారు. తన ప్రసంగాన్ని త్వరగా ముగించుకుని వెళ్లిపోయారు. నర్సీపట్నం జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో వైఎస్సార్ కంటివెలుగు కార్యక్రమ ప్రారంభానికి అధికారులు నిర్ణయించారు. అతిథుల కోసం స్టేజ్ ఏర్పాటు చేశారు కానీ..వేదిక ముందు కనీసం టెంట్‌కానీ..కూర్చీలు కానీ లేవు. దీంతో విద్యార్థులు ఎండలోనే మగ్గిపోయారు. కూర్చోడానికి నీడలేక సభ జరుగుతున్నంత సేపు పిల్లలు చెట్టుకు ఒక్కరు పుట్టుకు నిలబడ్డారు. పరిస్థితి గమనించి అతిథులు తమ ప్రసంగాలను త్వరగా ముగించి వెళ్లిపోయారు.