మేము 2018 లోనే ఆ పథకం ప్రారంభించాం : కాల్వ శ్రీనివాసులు

Update: 2019-10-11 01:34 GMT

టీడీపీ ప్రవేశపెట్టిన పథకాలను కాపీ కొట్టి పేర్లు మార్చి వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. సీఎం జగన్ ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమాన్ని.. తమ ప్రభుత్వం 2018లోనే శ్రీకారం చుట్టిందని ఆయన విమర్శలు గుప్పించారు. టీడీపీ హయాంలో చంద్రబాబు.. 222కేంద్రాల్లో అత్యాధునిక విధానం ద్వారా కంటిపరీక్షలు, శస్త్ర చికిత్సలు చేయించారని కాల్వ అన్నారు. తమ ప్రభుత్వంలో 67లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించి.. 6లక్షల మందికి పైగా కళ్లజోళ్లు అందజేసినట్టు ఆయన గుర్తు చేశారు. అనంతపురంలో అభివృద్ధి కుంటుపడిందని..కొత్తగా ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు.

Similar News