వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగు పథకంపై..తెలుగుదేశం పార్టీ నేతల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ ప్రభుత్వ హయాంలోని పథకాన్నే కాపీ కొట్టి..పేరు మార్చి అమలు చేస్తున్నారని మండిపడుతున్నారు. కంటి సమస్యలతో ఎందరో ఆభాగ్యులు చూపు కోల్పోతున్నారని గ్రహించి గత టీడీపీ ప్రభుత్వం 2018లో రాష్ట్రవ్యాప్తంగా సీహెచ్‌సీల్లో ముఖ్యమంత్రి ఐ కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. ఐ కేంద్రాల ద్వారా లక్షా 89వేల మంది కంటి సమస్యల నుంచి విముక్తి పొందరన్నారు టీడీపీ నేతలు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం దానికే కొత్త పథకం అంటూ పేరు మార్చి హడావిడి చేయడం ఏంటని మండిపడుతున్నారు.