ప్లాస్టిక్ వ్యర్థాలు తీసుకొచ్చినవారికి ఉచితంగా సన్నబియ్యం

Update: 2019-11-02 06:17 GMT

ప్లాస్టిక్ నియంత్రణకు ములుగు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు తీసుకొచ్చినవారికి ఉచితంగా సన్నబియ్యం ఇస్తామని ప్రకటించారు. ఎంత బరువున్నప్లాస్టిక్ తీసుకొస్తే.. అంతే స్థాయిలో సన్నబియ్యం ఇవ్వనున్నారు. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. స్వచ్చందంగా ప్లాస్టిక్ వ్యర్థాలను అప్పగిస్తున్నారు ప్రజలు. వీటికి బదులుగా క్లాత్ కవర్లులో బియ్యం తీసుకెళుతున్నారు. అంతేకాదు. ఇప్పటికే 35వేల క్లాత్ సంచులను సరఫరా చేశారు. ఎవరైనా ప్లాస్టిక్ కవర్లు వాడినా, కొన్నా.. వారిపై భారీగా పెనాల్టీ విధిస్తామని చెబుతున్నారు. ప్లాస్టిక్ నివారణకు కలెక్టర్ తీసుకుంటున్న చర్యలు భేషుగ్గా ఉన్నాయంటూ జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News