నవంబర్ 3న విశాఖలో జరగనున్న లాంగ్ మార్చ్‌కు జనసేన సిద్ధమవుతోంది. ఇసుక సంక్షోభంపై.. భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ చేపట్టారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న లాంగ్ మార్చ్.. మద్దిలపాలెం జంక్షన్ నుంచి రామాటాకీస్, ఆశిల్ మెట్ట మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని జీవీఎంసీ బిల్డింగ్ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్దకు చేరుకుంటుంది. తరువాత అక్కడ జరిగే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్, జనసైనికులు.. భవన నిర్మాణ కార్మికులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అటు.. లాంగ్ మార్చ్ కోసం రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చే వాహనాలకు ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్‌లో పార్కింగ్ ఏర్పాటు చేశారు.