ఈ నెల 14న చంద్రబాబు దీక్ష

Update: 2019-11-05 10:11 GMT

ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక కొరతపై ఒకరోజు దీక్ష చేయబోతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఈ నెల 14న విజయవాడలో దీక్ష చేస్తానని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలలైనా.. ఇసుకను అందుబాటులోకి తేలేదని విమర్శించారు. భవన కార్మికుల ఆత్మహత్యలపై మంత్రులు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని చంద్రబాబు తప్పుపట్టారు. గతంలో మాదిరి ఇసుకను ఉచితంగా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

మరోవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన వైసీపీ సర్కారుకు ఏమాత్రం లేదన్నారు చంద్రబాబు నాయుడు విమర్శించారు. సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం బదిలీ ఇందుకు నిదర్శనమని.. కక్షపూరితంగా వ్యవహరిస్తూ, వ్యక్తులను, వ్యవస్థలను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.

 

Similar News