నాడు-నేడు కింద స్కూళ్లలో 9 రకాల పనులు.. సీఎం జగన్

Update: 2019-11-05 07:32 GMT

స్కూళ్లు, ఆసుపత్రుల్లో నాడు-నేడు కార్యక్రమంపై ఏపీ సీఎం జగన్‌ అమరావతిలో జగన్‌ సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఆదిమూలపు సురేష్‌, ఆళ్లనానితోపాటు అధికారలు సమీక్షలో పాల్గొన్నారు. దాదాపు 45 వేల స్కూళ్లను నాడు-నేడు కింద బాగు చేస్తున్నాని సీఎం తెలిపారు. ఆ తర్వాతి దశలో జూనియర్‌, డిగ్రీ, పాలిటెక్నిక్‌, ఐటీఐ, గురుకులాలు, హాస్టళ్లను బాగు చేస్తామన్నారు జగన్‌. నాడు-నేడు కింద స్కూళ్లలో 9 రకాల పనులు చేపడుతున్నామని తెలిపారు సీఎం.

స్కూళ్ల పరిపాలన అంశాలతోపాటు నిర్వహణలో కూడా తల్లిదండ్రులతో కూడిన విద్యా కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. వచ్చే ఏడాది 1నుంచి 8వ తరగతి వరకు ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెడుతున్నామన్నారు. స్కూలు ప్రారంభకాగానే వారికి యూనిఫామ్స్‌, బూట్లు, పుస్తకాలివ్వాలని అధికారులకు సూచించారు. మండలంలోని హైస్కూళ్లను జూనియర్‌ కాలేజీలుగా అప్‌గ్రేడ్‌ చేయాలన్నారు.

నాడు-నేడు కింద అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను బాగు చేస్తున్నామని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. సబ్‌ సెంటర్లు, PHCలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, బోధనాసుపత్రులు కూడా మెరుగుపరుస్తామన్నారు. ప్రతి ఆసుపత్రుల్లో మందుల కొరత లేకుండా చేడాలన్నారు. నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో నాణ్యతా ప్రమాణాలుండాని జగన్ సూచించారు. వచ్చే ఏడాది మే నాటికి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, నర్సుల పోస్టుల భర్తీ కావాలన్నారు. ప్రతి విడతలో నాడు-నేడు కింద గ్రామీణ, గిరిజన, మున్సిపాలిటీల్లో స్కూళ్లు ఉండేలా చూసుకోవాని సీఎం అధికారులకు సూచించారు.

Similar News