రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లను వెంటనే గుర్తించి మరమ్మతులు చేపట్టాలని ఆర్ అండ్‌బీ అధికారులకు సీఎం జగన్ సూచించారు.. రోడ్లు, భవనాల శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి.. ఇసుక కొరతపైనా మాట్లాడారు. ఇసుక కొరత తాత్కాలికమే అన్నారు. ఈనెలాఖరు నాటికి సమస్య తీరుతుందని భావిస్తున్నట్లు సీఎం చెప్పారు.