ఇసుక కొరత.. మరో కార్మికుడు బలి

Update: 2019-11-05 05:02 GMT

ఏపీలో ఇసుక కొరత.. అనేకమంది భవననిర్మాణ కార్మికుల్ని బలిగొంటొంది. తాజాగా విజయవాడలో మరో భవననిర్మాణ కార్మికుడు చనిపోయాడు. అజిత్‌సింగ్‌నగర్‌లో రాడ్‌ బెండింగ్‌ మేస్త్రీ జయరావు అనారోగ్యంతో చనిపోయాడు. ఓవైపు అనారోగ్యం, మరోవైపు ఉపాధిలేక ఆర్ధిక ఇబ్బందులు ఉండటంతో.. తీవ్ర మనోవేదనకు గురయ్యాడు జయరావు. కనీస వైద్యం చేయించుకునేందుకు కూడా చేతిలో చిల్లిగవ్వ కూడా లేదని ఆవేదన చెందిన ఆయన.. అనారోగ్యంతో చనిపోయాడు.

Similar News