ఇసుక కొరతతో ఉపాధిలేక కాకినాడలో బలవన్మరణానికి పాల్పడ్డ కొయ్య భవన నిర్మాణ కార్మికుడు వీరబాబు కుటుంబాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించారు. కుటుంబ పరిస్థితిపై ఆరాతీసి అండగా ఉంటామని లోకేష్ హామీ ఇచ్చారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు, మేయర్ సుకంర పావని, మాజీ ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, జ్యోతుల నెహ్రూ తదితరులు లోకేష్ వెంట ఉన్నారు.
భవన నిర్మాణ కార్మికుడైన వీరబాబు.. స్థానిక డెయిరీ ఫామ్ సెంటర్‌లోని రాజీవ్ గృహకల్ప బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉపాధి లేకపోవడంతో కుటుంబాన్ని పోషించలేక మనస్తాపం చెందిన కొయ్య వీరబాబు.. బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. వీరబాబుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబానికి పెద్దదిక్కు ఆత్మహత్య చేసుకోవడంతో వీరబాబు కుటుంబం రోడ్డున పడింది.