అమరావతిలోని కొత్తూరు తాడేపల్లిలోని గోశాల ఆవుల మృతిపై ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదిక ప్రభుత్వానికి అందజేసింది. పశుగ్రాసంలో టాక్సిసిటి కారణంగానే ఆవులు చనిపోయినట్టు నిర్దారించారు. ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన గడ్డిలో రసాయనాల తీవ్రత అధికంగా ఉండటం వల్లే పశువులు మృతి చెందినట్టు తేల్చారు నిపుణులు. టాక్సిసిటి మోతాదు అధికంగా ఉండి.. అవి నైట్రేట్లుగా మారి ఆవుల ప్రాణాలు తీసినట్టు నివేదికలో పేర్కొన్నారు. ఆగస్టు 10న అర్ధరాత్రి గోశాలలో అనూహ్యంగా 90ఆవులు మృతిచెందాయి. అప్పట్లో ఇది రాజకీయంగా పెనుదుమారం రేపింది. కుట్రకోణంపైనా అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.