విశాఖలో డెంగీ మరణమృదంగం మోగిస్తోంది. జిల్లాలో ఇప్పటికే 809 పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా పెదగంట్యాడలోని దుర్గావానిపాలెంలో డెంగీతో బాలింత మృతి చెందింది. సోమవారం పండంటి బాబుకు జన్మనిచ్చిన సింధుప్రియ.. జ్వరం తీవ్రం కావడంతో కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ చనిపోయింది. పుట్టిన బాబును కళ్లారా చూసుకోకముందే తల్లి మరణించడంతో.. బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.
విశాఖలో కొన్ని రోజులుగా విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. రోగులతో ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. జిల్లాలో డెంగీ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. పదుల సంఖ్యలో జనం చనిపోయినా.. జిల్లా వైద్యశాఖ అధికారులు ఒక్క మరణాన్ని కూడా ధ్రృవీకరించడంలేదు.