ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన ఇంగ్లిష్ మీడియంలోకి మార్చాలని చేస్తున్న ప్రయత్నాలను.. పలువురు భాషాభిమానులు తప్పుబడుతున్నారు. మాతృభాషను కాపాడుకోవాలని ఆంధ్రా యూనివర్సిటీ తెలుగు విభాగం ఉపాధ్యాయులు పిలుపునిస్తున్నారు. మాతృభాషను నిర్వీర్యం చేసేలా ప్రభుత్వ చర్యలు ఉండకూడదంటున్నారు.
భావితరాలు తెలుగును మరిచిపోయే ప్రమాదం ఉందని.. ఏయూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాలు మాతృభాషకు ప్రాధాన్యం ఇస్తుంటే.. మన ప్రభుత్వం భాషను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శిస్తున్నారు.