జగన్‌కు ఒకరోజు మినహాయింపు

Update: 2019-11-08 07:58 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు కోర్టు హాజరు నుంచి ఒకరోజు మినహాయింపు లభించింది. ఆస్తుల కేసులో ఆయన ప్రతి శుక్రవారం హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు వెళ్లాల్సి ఉంది. అయితే.. ఈ శుక్రవారం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాష్ట్ర పర్యటనకు వచ్చారంటూ జగన్ మినహాయింపు కోరారు. అందుకు న్యాయస్థానం సమ్మతించింది. దీంతో.. జగన్‌ కోర్టుకు వెళ్లలేదు. మరోవైపు.. ఆస్తుల కేసు విచారణ ఈనెల 22కు వాయిదా పడింది.

Similar News