కూతురిలా ఉన్నావంటూ పక్కన కూర్చుని పులిహోర కలిపి.. బస్‌లో అతడు చేసిన పని..

Update: 2019-11-08 06:45 GMT

ఎక్కడి నుంచి ఆమెని గమనిస్తూ వస్తున్నాడో ఏమో.. పక్కాగా స్కెచ్ గీసుకున్నాడు.. ఆమె బస్ ఎక్కగానే.. అమ్మాయ్.. అచ్చం నా కూతురిలాగే ఉన్నావ్ తల్లి.. ఏ ఊరెళ్లాలమ్మా.. ఒక్కదానివే వెళుతున్నావు.. బస్ దిగాక ఎవరైనా వస్తారా తీసుకెళ్లడానికి.. అంటూ ఎంతో తియ్యగా మాట్లాడాడు.. ఆమె కూడా అవును బాబాయ్ గారూ అంటూ వరసలు కలపాల్సి వచ్చింది.. అతగాడు వచ్చి పక్కనే కూర్చునే సరికి. స్టాప్ వచ్చినా దిగపోయేసరికి అనుమానం వచ్చి డ్రైవర్ ఆమె దగ్గరకు వెళ్లి లేపాడు.. లేచి చూసుకుని నెత్తీ నోరు మొత్తుకుంది.

విజయవాడ మొగల్రాజపురానికి చెందిన రమణాయమ్మ స్వస్థలం విశాఖపట్నం. పనిమీద విశాఖ వెళ్లి తిరిగి విజయవాడ వచ్చేందుకు ఆర్టీసీ బస్ ఎక్కింది. ఇంతలో ఆమెకు పరిచయం లేని పెద్దాయన ఒకరు వచ్చి పక్కన కూర్చుని మాటలు కలిపాడు. నా కూతురులా ఉన్నావంటూ నమ్మించాడు. భోజనాల కోసమని బస్‌ని ఒక దగ్గర ఆపే సరికి కిందకు వెళ్లి ఏమైనా తీసుకువస్తాను తాగడానికి అన్నాడు. వద్దంటున్నా వినకుండా ఆమెకీ కూల్ డ్రింక్ ఒకటి తీసుకువచ్చి తాగమని బలవంతం చేశాడు. తాగిన కాసేపటికే రమణాయమ్మ నిద్రలోకి జారుకుంది. తెల్లారిపోయింది. బస్ విజయవాడ చేరుకుంది. ప్రయాణీకులంతా దిగి పోతున్నారు. ఆమె మాత్రం దిగట్లేదు. అలాగే కూర్చుని నిద్రపోతోంది. డ్రైవర్‌కి అనుమానం వచ్చింది.

ఆమె దగ్గరకు వచ్చి ఏమ్మా విజయవాడ వచ్చింది ఇంకా పడుకునే ఉన్నావే అనేసరికి.. ఏంటి ఇలా నిద్రపోయాను.. అసలేం జరిగింది అని గుర్తు తెచ్చుకునేసరికి పక్కన కూర్చున్న వ్య క్తి కూల్ డ్రింక్ ఇచ్చిన విషయం .. అది తాగి నిద్రలోకి జారుకున్న సంగతి గుర్తుకు వచ్చింది. ఆ తరువాత ఏం జరిగిందీ తెలియదు. వంటి మీద నగలన్నీ వలుచుకు పోయాడు. పర్సుల్లో డబ్బుల్లన్నీ కాజేశాడు. రెండు సెల్‌ఫోన్లు కూడా దోచుకు పోయాడని తెలుసుకుంది. దొంగ మాయమాటలు చెప్పి నిలువునా దోచుకున్నాడని తెలిసి లబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Similar News