పోలవరం హైడల్ ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. దీనిపై విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ప్రతివాదులకు కూడా నోటీసులు జారీ చేసింది. పోలవరం హైడల్ ప్రాజెక్టు నిర్మాణం నుంచి నవయుగను తప్పిస్తూ గతంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీనిపై నవయుగ పలుమార్లు కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ తాజా ఉత్తర్వులు వచ్చాయి.