పిడుగుపాటుకు గురై చనిపోయిన ఎద్దు.. రైతుకు ఎన్నారై ప్రభాకర్‌రెడ్డి సాయం..

Update: 2019-11-10 04:30 GMT

సిద్దిపేట జిల్లా కూరెళ్ల గ్రామంలో శ్రీశైలం అనే రైతుకు చెందిన ఎద్దు పిడుగుపాటుకు గురై చనిపోయింది. దీంతో ఆ రైతు కుటుంబం తీవ్ర వేదన చెందింది. తమకు అండగా ఉన్న ఎద్దు మరణించిదంటూ.. ఆ కుటుంబం రోదించింది. శ్రీశైలం కుటుంబం ఆవేదనను.... సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు ఓ వ్యక్తి. ఇది చూసి అమెరికాలోని న్యూజెర్సీలో స్థిర పడిన ప్రభాకర్‌రెడ్డి అనే వెటర్నరీ డాక్టర్‌ చలించాడు. రైతు వివరాలు అడిగి తెలుసుకుని... 20వేల రూపాయలు పంపాడు. ఈ డబ్బుతో శ్రీశైలం ఓ ఎద్దును కొలుగోలు చేశాడు. ఈ సందర్భంగా ఎన్నారైకి కృతజ్ఞతలు తెలిపాడు శ్రీశైలం.

Similar News