ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారంటూ అనంతపురం పంచాయితీరాజ్ AEE సురేష్ రెడ్డి ఇంటిపై ఏసీబీ సోదాలు నిర్వహించింది. 3కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. చాలా కాలంగా మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వద్ద పీఏగా పనిచేస్తున్న సురేష్ రెడ్డి.. రాజకీయ నేతల అండదండలతో అక్రమాస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలున్నాయి.
జేసీ దివాకర్ రెడ్డి పదవిలో ఉన్నా.. లేకపోయినా ఆయనకు సురేష్ రెడ్డి సేవలందించారు. అనంతపురం, పుట్టపర్తి, బేతంచర్ల ప్రాంతాల్లో సురేష్ రెడ్డి బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. కీలక డాక్యుమెంట్లు సీజ్ చేసినట్టు సమాచారం.