వైసీపీ నేతల దాడులపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా మండిపడ్డారు. వైఎస్ జగన్‌కు సైకోయిజం పీక్స్‌కు చేరిందంటూ ట్విట్టర్‌లో విమర్శించారు. ఆఖరికి ఒంటరి మహిళని సైతం వైసీపీ నేతలు వదలడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తల ఇళ్లకి అడ్డంగా గోడలు కట్టారని.. ఇప్పుడు ఏకంగా మహిళలపై దౌర్జన్యానికి దిగుతున్నారంటూ విమర్శించారు.
ప్రకాశం జిల్లా, తిమ్మారెడ్డి పాలెంలో ఆదిలక్ష్మమ్మ ఇంటి ముందు కట్టిన గోడను చూస్తేనే.. జగన్‌కు మహిళల పట్ల ఉన్న గౌరవం ఎంటో అర్థమవుతుందంటూ ట్విట్టర్‌లో విమర్శించారు. వైసీపీ నేతలు కట్టిన గోడలతో.. ఇళ్ల నుంచి బయటి రాకుండా చేయగలరేమో కానీ ప్రజల్లో మీ ప్రభుత్వం పట్ల పెరుగుతున్న వ్యతిరేకతను ఆపలేరంటూ ట్వీట్ చేశారు. ఈ వార్తకు సంబందించి పేపర్ క్లిప్‌ను ట్యాగ్ చేశారు లోకేష్.
ప్రతీ అమ్మకి, ప్రతీ అక్కకి, ప్రతీ చెల్లికి చెప్పండి @ysjagan గారి సైకోయిజం పీక్స్ కి చేరిందని. ఆఖరికి ఒంటరి మహిళని కూడా వైకాపా రౌడీలు వదలడం లేదు. టీడీపీ కార్యకర్తల ఇళ్లకి అడ్డంగా గోడలు కట్టారు. ఇప్పుడు ఏకంగా మహిళలపై దౌర్జన్యానికి దిగుతున్నారు. (1/2) pic.twitter.com/fVmeggNUem
— Lokesh Nara (@naralokesh) November 16, 2019