ఏపీలో మీడియాపైనా, భావ ప్రకటనా స్వేచ్ఛపైనా జరుగుతున్న దాడులపై కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లోక్ సభలో డిమాండ్ చేశారు. ఏపీలో టీవీ5 సహా మరో ఛానల్ రాకుండా ప్రభుత్వమే అడ్డుకుందన్నారు. 2430 జీవో పేరుతో ప్రభుత్వ కార్యదర్శలకు వ్యతిరేక వార్తలు వస్తే మీడియాపై కేసులు పెట్టేలా అధికారాలు కట్టబెట్టారన్నారు. జర్నలిస్టుల హత్యలు, దాడులు మితిమీరిపోతున్నాయని.. కేసులు పెట్టినా.. పోలీసులు FIR రాయడం లేదని గల్లా జయదేవ్ పార్లమెంట్ దృష్టికి తీసుకొచ్చారు. మీడియా స్వేచ్చను హరించేలా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు.