కాలేజ్ యాజమాన్యం నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. నల్గొండ జిల్లా మోత్కూర్ సాయిరామ్ కాలేజ్‌లో డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు జరుగుతున్నాయి. బుధవారం కెమిస్ట్రీ ఆఫ్ కాస్మొటిక్ ఎగ్జామ్ నిర్వహించాలి. కానీ ఆ పేపర్‌కు బదులుగా.. లా ప్లేస్ ట్రాన్స్‌ఫార్మ్స్ పేపర్ ఇచ్చారు. దీంతో విద్యార్థులంతా బిక్కమొహం వేశారు. కాలేజ్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే.. సప్లమెంటరీ రాసుకోండంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
అటు యూనివర్సిటీ అధికారులు కూడా ఇందులో తమ తప్పేం లేదని.. అంతా సాయిరామ్ కాలేజ్ నిర్లక్ష్యం వల్లే జరిగిందని చెబుతున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థులు.