ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆయనకు ఫోన్ చేసి మాట్లాడారు. పీసీసీ చీఫ్‌గా కిరణ్‌కుమార్ రెడ్డి పేరును ఉమెన్ చాందీ ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ రావాలని పిలుపు వచ్చినట్లుగా సమాచారం. అయితే, పీసీసీ పదవి పట్ల కిరణ్‌కుమార్‌రెడ్డి అంత సుముఖంగా లేనట్లుగా తెలుస్తోంది. అధిష్ఠానికి కారణాలు వివరించేందుకు ఆయన ఢిల్లీ వెళ్లారు. ఒకవేళ కిరణ్‌కుమార్ రెడ్డి కాదంటే ప్రత్యామ్నాయంగా పళ్లంరాజు పేరును అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.