అనంతపురం జిల్లా పుట్టపర్తి పరిధిలోని బ్రాహ్మణపల్లి SBI వద్ద డిపాజిట్ దారులు ఆందోళనకు దిగారు. బ్యాంక్‌కు తాళాలు వేసి.. ఇటీవల స్వాహా అయిన 57 లక్షల డిపాజిట్ సొమ్మును తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో బ్యాంక్ సేవలు నిలిచిపోయాయి. బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు వచ్చిన 35 మంది నిరక్షరాస్యుల నుంచి.. గతంలో ఇక్కడ పని చేసిన మెనేజర్ రమేష్.. 57 లక్షల్ని స్వాహా చేశాడు. రెండు నెలల కిందటే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రెండు నెలలుగా డిపాజిట్ సొమ్ము చెల్లించకపోగా.. ఎటువంటి హామీ ఇవ్వకపోవడంతో ఆందోళన చెందిన బాధితులు ఆందోళనకు దిగారు. ఆందోళనకారులుకు పోలీసులు సర్ధి చెప్పారు. డిపాజిట్ సొమ్ము గోల్‌మాల్‌పై విచారణ జరుగుతోందని.. ఆందోళన చెందవద్దని చెప్పారు. చివరకు బ్యాంక్ అధికారుల హామీతో ఆందోళన విరమించారు.