గత ప్రభుత్వంలో జరిగిన కుంభ కోణాల్లో లూలు కుంభకోణం ఒకటన్నారు మంత్రి అవంతి శ్రీనివాస్. అందుకే లూలు ఒప్పందాన్ని రద్దు చేశామన్నారు. లూలు స్థానంలో మంచి కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మిస్తామని తెలిపారు. విశాఖ జీవీఎంసీలో నిర్వహించిన సమీక్షలో పాల్గొన్న మంత్రి అవంతి.. సీజనల్ వ్యాధుల నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.