హైదరాబాద్ శివారు హయత్ నగర్ పరిథిలోని కుంట్లూరులో చెడ్డీ గ్యాంగ్ అలజడి సృష్టించింది. అర్ధరాత్రి రెండిళ్లలో నగదు, బంగారం దోపిడీ చేసింది. ఓ వృద్ధురాలి చెవులకున్న దుద్దుల్ని లాక్కోవడంతో.. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. దాదాపు గంటపాటు దొంగలు అదే ఇంట్లో ఉన్నారు. పోలీసులు రావడంతో వారు గోడదూకి పారిపోయారు. గతంలోనూ చెడ్డీ గ్యాంగ్ కుంట్లూరులోనే హల్‌చల్ చేసింది. దీంతో గ్రామస్తుల్లో భయాందోళన నెలకొంది.