ఏపీ ప్రభుత్వం వెంటనే ఇసుక సమస్యను పరిష్కరించాలంటూ ఒంగోలు కలెక్టరేట్ ముందు కార్మికులు ధర్నా నిర్వహించారు. ప్రస్తుత ప్రభుత్వ విధానాల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. ఇసుక కొరతతో ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు 10 వేల భృతిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. టన్ను ఇసుక 150 రూపాయలకు మించకుండా ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.