శ్రీవారిని రాజకీయాల్లోకి లాగొద్దు: అవంతి శ్రీనివాస్

Update: 2019-11-23 06:16 GMT

సర్వసృష్టి మానవాళికి ఆ దేవ దేవుడే దిక్కు అని.. అలాంటి దేవుణ్ని, మతాల్లోకి, రాజకీయాల్లోకి లాగొద్దని మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. శనివారం ఉదయం VIP విరామ సమయంలో వెంకన్నస్వామి సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం చేయగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

రాష్ట్రాన్ని సుభిక్షంగా పాలించే శక్తిని వైఎస్‌ జగన్‌కి కల్పించాలని స్వామివారిని ప్రార్థించినట్టు అవంతి శ్రీనివాస్‌ తెలిపారు. వైవి సుబ్బారెడ్డి టీటీడీ పాలక మండలి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సామాన్య భక్తులు గురించి ఆలోచించి బ్రేక్‌ దర్శనాలు రద్దు చేశారని తెలిపారు.

Similar News