ఎంపీ గల్లా జయదేవ్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి సహకారంతోనే భారత్ మ్యాప్‌లో అమరావతిని చేర్చారన్నారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. దేశచిత్రపటంలో అమరావతి లేకుండా చేయాలని వైసీపీ చేసిన కుట్రలకు కేంద్రం చెక్ పెట్టిందన్నారాయన. కార్యకర్తలకు అండగా నెల్లూరులో పరిష్కారం కార్యక్రమంలో పాల్గొన్నారు సోమిరెడ్డి. ప్రభుత్వం చేపట్టిన స్పందనలో ప్రజలకు పరిష్కారం దొరక్కపోవడం వల్లే.. పరిష్కారం కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.