ఎమ్మెల్సీ లోకేశ్ ను డీఆర్సీ సమావేశాలకు పిలవొద్దని తీర్మానం చేసిన వైసీపీ

Update: 2019-11-23 07:26 GMT

ఎమ్మెల్సీ లోకేశ్ ను అధికారిక సమావేశాలకు అనుమతించవద్దని గుంటూరు డీఆర్సీలో తీర్మానం చేశారు. గుంటూరు జిల్లా పర్యటనలో భాగంగా నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి, హోమంత్రి సుచరితపై లోకేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తీవ్రంగా స్పందించారు వైసీపీ ఎమ్మెల్యేలు. ప్రభుత్వ సమావేశాలకు ఆహ్వానించవద్దని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రతిపాదించారు. మంత్రులు మోపిదేవి వెంకటరమణ, రంగనాథరాజు, సుచరితతో పాటు జిల్లా ఎమ్మెల్యేలు ఆళ్ల నిర్ణయాన్ని సమర్ధించారు. దీంతో లోకేష్ ను డీఆర్సీ సమావేశాలకు పిలవరాదని తీర్మానం ఆమోదించారు.

Similar News