రంగారెడ్డిజిల్లా పాలమాకుల వద్ద గ్యాస్‌ట్యాంకర్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. చెన్నై నుంచి గ్యాస్‌లోడ్‌తో వస్తున్న ట్యాంకర్ ఒక్కసారిగా అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. గ్యాస్ ట్యాంకర్ బోల్తాతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
వెంటనే స్పాట్‌కు చేరుకున్న పోలీసులు.. వాహనాన్ని తీసి రాకపోకలను క్లియర్ చేశారు. ట్యాంకర్‌లో 34 టన్నుల ఎల్‌పీజీ గ్యాస్ ఉన్నట్లు తెలుస్తోంది. ట్యాంకర్ పేలితే 10 కిలో మీటర్ల వరకు ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు. ట్యాంక్ పేలకుండా పెను ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.